Abn logo
Jul 15 2020 @ 03:14AM

హోల్డర్‌ @ 2

టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: వెస్టిండీస్‌ కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ అంతర్జాతీయ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో  ఏడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. దీంతో 862 రేటింగ్‌ పాయింట్లతో కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకు సాధించాడు. గత 20 ఏళ్లలో ఏ విండీస్‌ బౌలర్‌ కూడా ఇన్ని పాయింట్లు సాధించకపోవడం విశేషం. 2000లో వాల్ష్‌ అత్యధికంగా 866 పాయింట్లు పొందాడు. ప్యాట్‌ కమిన్స్‌ (ఆసీస్‌) తొలి స్థానంలో, బుమ్రా ఏడో ర్యాంకులో ఉన్నాడు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో స్టీవ్‌ స్మిత్‌, కోహ్లీ టాప్‌-2 ఆటగాళ్లుగా కొనసాగుతుండగా పుజారా ఏడు, రహానె తొమ్మిదో స్థానాల్లో ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement