Abn logo
Jun 4 2020 @ 02:16AM

కరోనా మనుగడ వెనుక గుట్టు వీడింది

టోక్యో, జూన్‌ 3: కరోనా వైరస్‌ మనిషి రోగ నిరోధక వ్యవస్థను ఎలా ఎదుర్కొంటోందన్న వివరాలను జపాన్‌లోని టోక్యో వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శ్వాసకోశ వ్యవస్థలోకి వైరస్‌ చొరబడిన తర్వాత అక్కడి జీవకణాల్లోకి ఆర్‌ఎన్‌ఏను ప్రవేశపెట్టి తన సంఖ్యను పెంచుకునే ప్రక్రియను కరోనా ప్రారంభిస్తుంది. అయితే ఆర్‌ఎన్‌ఏపై దాడికి రోగ నిరోధక వ్యవస్థ చేసే ప్రయత్నాలను కొవిడ్‌-19 వైరస్‌ బలంగా తిప్పికొడుతుంది. ఇందుకోసం ముందుచూపుతో తన ఆర్‌ఎన్‌ఏలో వివిధ రసాయన క్రమాలను వైరస్‌ సిద్ధంగా ఉంచుతోందని, అందువల్లే దీర్ఘకాలం పాటు మనగలుగుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.  


Advertisement
Advertisement
Advertisement