చీరకట్టుతో కనికట్టు చేసిన జూనియర్ అతిలోకసుందరి

అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్.. కెరీర్ పరంగా టాప్ గేర్ లో దూసుకెళుతోంది. గ్లామరస్ పాత్రలు చేస్తూనే, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తూ సత్తా చాటుకుంటోంది. మరో పక్క ఫ్యాషన్ ట్రెండ్స్ లోనూ ముందుంటోంది. ఈ మధ్య కాలంలో అయితే అమ్మడు ఫోటో షూట్స్ తో కుర్రకారును మెస్మరైజ్ చేసి పడేస్తోంది. దీనికి తండ్రి బోనీకపూర్, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా అండదండలు నిండుగా మెండుగా ఉన్నాయి. అసలు విషయానికొస్తే.. తాజాగా జాన్వీ కపూర్.. చీరకట్టుతో కనికట్టు చేసి అతిలోకసుందరి అయిన తన తల్లిని గుర్తుకు తెస్తోంది. 

సాంప్రదాయ పద్ధతిలో చీరకట్టిన జాన్వీ ఆ చీరకట్టుకే కట్టుబాట్లు నేర్పుతోందంటూ.. నెటిజెన్స్ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మెట్ కి హాజరైన సందర్భంగా జాన్వీకపూర్ ఇలా ట్రెడిషనల్ గా ఎలివేట్ అయింది. సీత్రూ ఆర్గన్జా నెట్ శారీపై.. వైట్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది. అలాగే హెయిర్ స్టైల్ లో తన తల్లిని తలపించింది. మొత్తానికి చీరకట్టులో కుందనపు బొమ్మలా ఉంది. జాన్వీని ఇలా చీరకట్టులో చూడ్డానికి రెండు కళ్ళూ చాలడం లేదంటున్నారు అభిమానులు.  Advertisement

Bollywoodమరిన్ని...