Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇప్పనపాడులో నాదెండ్ల శ్రమదానం

మండపేట, డిసెంబరు 1: మండపేట- ద్వారపూడి మధ్య ఉన్న  ఆర్‌అండ్‌బీ రహదారి అధ్వానంగా మారిన విషయం తెలిసిందే. ఈ రోడ్డు దుస్థితి నేపథ్యంలో జనసేన మండపేట నియోజకవర్గ ఇన్‌చార్జి వేగుళ్ల లీలాకృష్ణ నేతృత్వంలో బుధవారం జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ శ్రమదానం మరమ్మతు పనులు ప్రారంభించారు. ఇప్పనపాడు నుంచి ద్వారపూడి వరకు రెండు కిలోమీటర్ల మేర శ్రమదానం చేసి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. అధికారం తమకు ముఖ్యంకాదని ప్రజా సమస్యలే ముఖ్యమని ఈ సందర్భంగా నాదెండ్ల అంటూ లీలాకృష్ణ తీసుకున్న చొరవ, జనసైనికుల పనితీరును ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఇప్పనపాడు సర్పంచ్‌ కుంచేవీరదుర్గ,  కందుల దుర్గేష్‌. పంతం నానాజీ, ముత్తా శశిధర్‌, మర్రెడ్డి శ్రీనివాస్‌, పితాని బాలకృష్ణ, బండారుశ్రీను వాసరావు, మాకినీడి శేషకుమారి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement