Abn logo
Oct 23 2021 @ 12:59PM

పేద విద్యార్థులు ఇక్కడే ఉండి మీకు ఊడిగం చేయాలా?: Potina

విజయవాడ: విదేశీ విద్య పథకాన్ని అటకెక్కించడానికి కారణం జగన్ అన్న కూతురు విదేశాల్లో చదువుతుంది అనేనా? అని జనసేన నేత పోతిన వెంకట మహేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, అగ్రవర్ణ పేదలు విదేశాల్లో ప్రభుత్వ సాయంతో చదువుకోవాలనే వారి కలల రెక్కలు విరగ్గొట్టారా? అని మండిపడ్డారు. విదేశాల్లో తమ కూతురు ఉన్నత విద్యను అభ్యసించవచ్చు... కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, ఓసి పేద విద్యార్థులు  ఇక్కడే ఉండి మీకు ఊడిగం చేయాలా? అని ప్రశ్నించారు. పల్లకీలు మోయాలా? ఓట్లు వేయాలా? అంటూ పోతిన వెంకట మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption