Abn logo
Dec 2 2020 @ 12:34PM

పవన్ కారు ర్యాలీలో అపశృతి

కృష్ణా: జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన కారు ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. నివర్ తుపాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు పవన్ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కారు ర్యాలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. పామర్రు మండలం కనుమూరు వద్ద రెండు కార్ల మధ్య బైక్ ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి కాలు విరిగింది. వెంటనే అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
Advertisement
Advertisement