Abn logo
Sep 29 2020 @ 15:12PM

ఆర్జేడీలో చేరిన గ్యాంగ్‌స్టర్ భార్య, కుమారుడు

Kaakateeya

పాట్నా: రాజకీయ నాయకుడిగా మారిన బిహార్ గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ భార్య, కుమారుడు రాష్ట్రీయ జనతా దళ్ పార్టీలో చేరారు. బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత పార్టీ ముఖ్య నేత తేజస్వీ యాదవ్ సమక్షంలో వారు సోమవారం లాంతర్ తీర్థం పుచ్చుకున్నారు. బిహార్ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉండడంతో పార్టీ చేరికలు జోరందుకున్నాయి. దీనికి ముందు బిహార్ పోలీస్ మాజీ ఛీఫ్ నితీష్ నేతృత్వంలోని జేడీయూలో చేరారు. అనంతం గ్యాంగ్‌స్టర్ భార్య, కుమారుడు ఆర్జేడీలో చేరడం బిహార్ రాజకీయాలను మరింత హీటెక్కించాయి.


ఆనంద్ మహీంద్రా ప్రస్తుతం ఓ మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 1994లో అప్పటి గోపాల్‌గంజ్ డిఎం జి కృష్ణయ్య మూకదాడిలో ఆనంద్ మోహన్ హత్యకు పాల్పడినట్లు రుజువు కావడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది.

Advertisement
Advertisement
Advertisement