Oct 13 2021 @ 13:04PM

Aryan Khan గురించి షాకింగ్ సమాచారం.. నాలుగు రోజులుగా భోజనం బంద్.. ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు యువరాజులా బతికిన ఆర్యన్ జైలులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడట. ఆర్యన్‌ను ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. 8వ తేదీన ఆర్యన్ ఆ జైలుకు వెళ్లాడు. ఆ జైలుకు వెళ్లిన దగ్గర్నుంచి ఆర్యన్ భోజనం ముట్టుకోలేదట. జైలు క్యాంటిన్‌లో కొనుకున్న పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్లతోనే ఆకలి తీర్చుకుంటున్నాడట. 


భోజనం చేయమని జైలు అధికారులు, సిబ్బంది ఎంతగా అడుగుతున్నా ఆర్యన్ మాత్రం అంగీకరించడం లేదట. ఆకలి వేయడం లేదని చెప్పి భోజనం చేయడం లేదట. అలాగే ఇంటి నుంచి తీసుకొచ్చిన వాటిర్ బాటిల్స్‌లోని నీటినే పొదుపుగా వాడుకుంటూ తాగుతున్నాడట. అంతేకాదు జైలులోని బాత్రూమ్‌కు ఆర్యన్ ఇప్పటివరకు వెళ్లలేదట. నాలుగు రోజులుగా స్నానం చేయలేదట. జైలు మాన్యువల్ ప్రకారం, ఖైదీ తనతో పాటు 2500 రూపాయలు తీసుకెళ్లవచ్చు. ఈ డబ్బు జైలు అధికారులు తీసుకుని ఖైదీకి ఓ కూపన్ ఇస్తారు. ఆ కూపన్‌ను ఉపయోగించి, జైలు క్యాంటిన్ నుంచి ఆహార పదార్థాలు, సబ్బు, నూనె, టూత్‌పేస్ట్ వంటివి కొనుగోలు చేసుకోవచ్చు. 


అపరిశుభ్రంగా ఉంటుందనే కారణంతో జైలు బాత్రూమ్‌కు కూడా ఆర్యన్ వెళ్లడం లేదట. కాలకృత్యాలు తీర్చుకోవడం లేదట. స్నానం చేయడం లేదట. భోజనం చేయకపోవడంతో ఆర్యన్ చాలా నీరసంగా అయిపోయాడట. దీంతో అతని ఆరోగ్యం గురించి జైలు అధికారులు ఆందోళన చెందుతున్నారట. కాగా, ఇప్పటికి మూడుసార్లు ఆర్యన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ రోజు (బుధవారం) మరోసారి విచారణ జరగనుంది. 

Bollywoodమరిన్ని...