Advertisement
Advertisement
Abn logo
Advertisement

యువతిని Harassing యువకుడికి జైలు

హైదరాబాద్/బోయినపల్లి: ప్రేమించాలంటూ  యువతిని వేధిస్తున్న యువకుడికి న్యాయస్థానం ఎనిమిది రోజులు జైలుశిక్ష విధించింది. సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా ఉమ్మాపూర్‌ గ్రామానికి చెందిన నాగరాజ్‌ (23) ఎలక్ర్టీషియన్‌.న్యూబోయినపల్లికి చెందిన యువతి(20)ని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమె విషయాన్ని తల్లికి చెప్పింది. ఆమె కొద్దిరోజుల క్రితం షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని హెచ్చరించి పంపించారు. అయినప్పటికీ నిందితుడు ఈ నెల 12న కళాశాలకు వెళ్తున్న యువతిని దారి లో అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించాడు. తల్లి సహాయంతో యువతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి మంగళవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం నాగరాజ్‌కు జైలు శిక్ష విధించింది.

Advertisement
Advertisement