Abn logo
Oct 14 2021 @ 00:04AM

సారా తయారీదారుల ఆటలు సాగవు

గండేపల్లిలో వివరాలు వెల్లడిస్తున్న సీఐ

జగ్గంపేట సీఐ సురే్‌షబాబు 

గండేపల్లి, అక్టోబరు 13: సారా తయారీదారులు, విక్ర యాలు చేసేవారి ఆటలు ఇకపై సాగవని, జల్లెడ పట్టి వారి ఆట కట్టిస్తామని జగ్గంపేట సీఐ సురే్‌షబాబు హెచ్చరించారు. బుధవారం గండేపల్లి పోలీ్‌సస్టేషన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ  ఎం.రవీంద్రనాథ్‌బాబు, జాయింట్‌ డైరెక్టర్‌ రమాదేవి ఆదేశాల మేరకు గండేపల్లి మండలం మురారి గ్రామంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌, తమ సిబ్బంది సుమారు నలభైమంది కలిసి గ్రామాన్ని చుట్టుముట్టి నలుగురు వ్యక్తులను 120లీటర్ల సారాతో పట్టుకున్నామని పేర్కొన్నారు. గ్రామ పొరమేర ప్రాంతాల్లో 5200లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామ న్నారు. ఇకపై తరుచూ సారా కేసులో దొరికినవారిపై పీడీయాక్ట్‌ కేసు పెట్టి కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ జి.వెంకటలక్ష్మి, ఎస్‌ఐ నాగేంద్రకృష్ణ, గండేపల్లి ఎస్‌ఐ పి.శోభన్‌కుమార్‌, కిర్లంపూడి ఎస్‌ఐ అప్పలరాజు, సిబ్బంది పాల్గొన్నారు. 


930 లీటర్ల సారా స్వాధీనం

రౌతులపూడి, అక్టోబరు 13: కార్టెన్‌ సర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా మండలంలోని ఎస్‌.పైడిపాల గ్రామంలో లా అండ్‌ ఆర్డర్‌, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌పార్టీ బుధవారం వేకువజామున చేపట్టిన దాడుల్లో 930 లీటర్ల నాటుసారా, 8500 లీటర్ల బెల్లపు ఊట స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్టు ఇన్‌చార్జి సీఐ కిషోర్‌బాబు పేర్కొన్నారు. పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్‌ సూచనలతో దాడులు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. దా డు ల్లో కోటనందూరు ఎస్‌ఐ ఎం.అశోక్‌, సిబ్బంది పాల్గొన్నారు.