Advertisement
Advertisement
Abn logo
Advertisement

జనంలోకి జగన అరాచకాలు

పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న నాయకులు కాలవ, బీకే, బీటీ నాయుడు, పల్లె, పరిటాల సునీత, నిమ్మల, జితేంద్రగౌడ్‌, పరిటాల శ్రీరామ్‌, ఈరన్న, ఉమా, ఉన్నం, ఆలం, ఆదినారాయణ, అంబికా, నాగరాజు, సవిత, రామ్మోహనచౌదరి, బుగ్గయ్యచౌదరి, వెంకటశివుడు యాదవ్‌, శ్రీధర్‌చౌదరి, గౌస్‌, జేఎల్‌ మురళి, కాటమయ్య, అంజినప్ప, బీవీ తదితరులు

ప్రతి పంచాయతీలో గౌరవ సభ

రైతులను ముంచిన దరిద్ర ప్రభుత్వమిది

ఓటీఎస్‌ ముసుగులో దోపిడీ దారుణం

వైసీపీ దుర్మార్గాలను ప్రజలకు వివరిస్తాం

అన్నివర్గాలకు న్యాయం జరిగేలా టీడీపీ పోరు

సమన్వయ కమిటీ సమావేశంలో నేతల వెల్లడి 

అనంతపురం వైద్యం, డిసెంబరు8: జగన అధికారం చేపట్టాక పెరిగిపోయిన అరాచకాలు, అసమర్థ పాలన గురించి ప్రజలకు తెలియజేయడానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టిందని పార్టీ జిల్లా నేతలు వెల్లడించారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని టీడీపీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వ హించారు. పొలిట్‌ బ్యూరో సభ్యుడు, అనంత పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు, హిందూపురం అధ్యక్షుడు బీకే పార్థసారథి, జిల్లా పరిశీలకుడు బీటీ నాయుడు, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నం హనుమంతరాయచౌదరి, జితేంద్రగౌడ్‌, ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రామ్మోహనచౌదరి, సవిత, టీడీపీ రా ష్ట్ర కార్యదర్శులు ఆలం నరసానాయుడు, తలారి ఆదినారాయణ, బుగ్గయ్యచౌదరి, వెంకటశివుడు యాదవ్‌, జేఎల్‌ మురళీధర్‌, కమతం కాటమయ్య, అంజినప్ప, రామాంజినమ్మ, జడ్పీ మాజీ చైర్మన పూల నాగరాజు, అనంత, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాల ప్రధాన కార్యదర్శులు శ్రీధర్‌చౌదరి, అంబికా లక్ష్మీనారాయణ, అఽధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌, కళ్యాణదుర్గం ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు, జిల్లా మీడియా ఇనచార్జ్‌ బీవీ వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. 2 గంటల పాటు జిల్లాలో రైతులతోపాటు ఓ టీఎ్‌సతో పేద ప్రజలు పడుతున్న కష్టాలు, ఇతరత్రా వర్గాల సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. వైసీపీ అరాచకాలు, రైతులకు చేస్తున్న అన్యాయం, జగన అసమర్థ పాలన వల్ల రాషా్ట్రనికి కలుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అందరూ సమష్టిగా పార్టీ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేలా చూడాలని నేతలు ఆలోచించారు. అనంతరం మీడియా సమావేశంలో నేతలతో కలిసి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ జగన అసమర్థత, అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గౌరవసభలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి పంచాయతీలో అన్ని వర్గాలతో గౌరవసభ సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తామన్నారు. రైతులను ఆదుకోలేని దుర్మార్గ ప్రభుత్వం ఇదని దుయ్యబట్టారు. 2018, 2020, 2021 మూడేళ్లు వరుసగా పంటలు నష్టపోయినా.. పరిహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. జిల్లా చరిత్రలో ఎప్పు డూ ఇలా రైతులకు అన్యాయం జరగలేదన్నారు. కనీసం పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటే రైతు ల పట్ల ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తుందన్నారు. రూ.వేల కోట్లు వేరుశనగ, పప్పుశనగ, ఉద్యానవన పంటలు నష్టపోతే కేవలం రూ.500 కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా వేయడం అన్యాయమన్నారు. పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతల గొంతు కోయడానికి సీఎం జగన చూస్తున్నారని మండిపడ్డారు. డబ్బు కోసం ఎప్పుడో దశాబ్దాల క్రితం కట్టిన ఇళ్లకు కూడా బలవంతంగా ఓటీఎస్‌ పేరుతో వసూళ్లకు పాల్పడడం దుర్మార్గమన్నారు. పే దల రక్తాన్ని పిండి వసూళ్లు చేయడం ఇప్పుడే చూస్తున్నామన్నారు. శనివారంలోపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గౌరవసభలు మొదలవుతాయనీ, ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజలకు వివరిస్తామన్నారు. అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేకూరే వరకు టీడీపీ అండగా ఉండి పోరాటం సాగిస్తుందన్నారు.

Advertisement
Advertisement