Abn logo
Sep 17 2021 @ 00:30AM

ఆదర్శ కాలనీలుగా తీర్చిదిద్దుతాం

 కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

 ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన

మార్టూరు, సెప్టెంబరు 16:  జగనన్న కాల నీలను ఆదర్శ కాలనీలుగా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. వీటిల్లో వి ద్యుత్‌, నీరు తదితర అన్ని వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. గురువారం మండలంలోని వ లపర్ల, మార్టూరు గ్రామాలలో జరిగిన ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయ న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వలపర్లలో ఇళ్ల స్థలాలకు ఇచ్చిన లేఅవుట్‌లో శంకుస్థాపన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభ లో కలెక్టర్‌ మాట్లాడుతూ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణా న్ని వేగవంతంగా పూర్తిచే సుకోవాలని చెప్పారు. అందుకు అధికారులు సహకరించాలన్నారు. వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రావి రామనాథం బాబు మాట్లాడుతూ  పేదల ఇళ్ల నిర్మాణానికి ప్ర భుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నారు. ఈ కాలనీలో 277 మందికి ఇళ్లు మంజూరయ్యాయని హాసింగ్‌ డీఈఈ మురళి చెప్పారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌ రావి పద్మావతి, తహసీల్దార్‌ ఈదా వెంకటరెడ్డి, పంచాయతీ కార్యదర్శి షేక్‌ రవూ ఫ్‌ ఖాన్‌, సర్పంచ్‌ తాళ్లూరి బ్రహ్మయ్య, జాఫర్‌ ఆలీ, కోటినాగులు, దామర్ల శ్రీను పాల్గొన్నారు.

అనంతరం మార్టూరులోని గన్నవరం రోడ్డులో ఇళ్ల లేఅవుట్‌ శంకుస్థాపన కార్యక్రమానికి కలెక్టర్‌ వి చ్చేశారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మా ణానికి అధికారులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పఠాన్‌ కాలేషావ లి, కాకోలు రామారావు, గడ్డం మ స్తానవలి, కాకోలు వెంకటేశ్వర్లు, హాసింగ్‌ ఏఈ విజ యానంద్‌, గర్నెపూడి రవిచందు పాల్గొ న్నారు.

 సచివాలయాల పరిశీలన

యద్దనపూడి (మార్టూరు), సెప్టెంబరు 16: మం డలంలో గన్నవరం, యద్దనపూడి గ్రామాలలోని స చివాలయాలను గురువారం కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమా ర్‌ పరిశీలించారు. కటారిపాలెంలో ఇళ్ల నిర్మాణ శం కుస్థాపన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. 

కార్య క్రమంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, తహసీల్దార్‌ వెంకట రత్నం, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ శరత్‌ చంద్ర, నా యకులు పోపూరి ఆదియ్య, పల్లెపోగు రాంబాబు, చెరుకూరి వేణు తదితరులు పాల్గొ న్నారు.