Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్‌ దిబెస్ట్ కాదు.. ది వరస్ట్ చీఫ్ మినిస్టర్: సీపీఐ నారాయణ

అనంతపురం: సీఎం జగన్‌పై సీపీఐ నేత నారాయణ విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌ దిబెస్ట్ కాదు.. ది వరస్ట్ చీఫ్ మినిస్టర్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ తాబేదారులు స్టీల్ ప్లాంట్ పై విశాఖలో తాండవ నృత్యం.. ఢిల్లీలో శంకరాభరణం నాట్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇక్కడ పాదయాత్ర, ఢిల్లీలో పాదపూజ చేస్తూ ప్రధాని మోదీకి అనుకూలంగా పాదాలు నొక్కుతున్నారని నారాయణ ఎద్దేవాచేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి మైక్ తీసుకుని డ్యాన్స్ చేస్తుంటే అసహ్యించుకుంటున్నారని తెలిపారు. సీఎం అధికారపూర్వకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబును అఖిలపక్ష సమావేశవానికి పిలవాలని డిమాండ్ చేశారు. అప్పడు ఒక్క స్ట్రోక్‌తో మోదీ దిగివస్తారని, విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement