Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్ ఆస్తుల కేసు: సబితా పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్: సీబీఐ కోర్టులో పలు కేసుల విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసులో సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది. పెన్నా సిమెంట్స్ ఛార్జ్‌షీట్ నుంచి తనను తొలగించాలని సబితా ఇంద్రారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.ఈ  పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు సీబీఐ సమయం కోరింది. విచారణను కోర్టు ఈ నెల 13కి వాయిదా వేసింది. 


రిటైర్డ్‌ ఐఏఎస్ శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్‌పైనా సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్ కేసు నుంచి శామ్యూల్‌ను తొలగించొద్దని సీబీఐ పేర్కొంది. పయనీర్ హాలిడే రిసార్ట్స్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కూడా కౌంటరుకు సీబీఐ సమయం కోరింది. ఇక పీఆర్ ఎనర్జీ డిశ్చార్జ్ పిటిషన్‌పైనా కౌంటరు దాఖలుకు సమయం కోరింది. పెన్నా సిమెంట్స్ ఛార్జ్‌షీట్‌పై విచారణను ఈ నెల 13కి కోర్టు వాయిదా వేసింది. 

Advertisement
Advertisement