Abn logo
Jul 10 2020 @ 04:27AM

కలుషిత మాంసాన్ని తినవద్దు

ఐటీడీఏ పీవో డాక్టర్‌ వెంకటేశ్వర్‌ 


పాడేరు, జూలై 9 : నిల్వ, కలుషితమైన మాంసాన్ని తినకూడదని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ సూచించారు. గురువారం స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జి.మాడుగుల మండలం మగతపాలెం బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన జంతు మాంసాన్ని తింటే  అతిసార వంటివి వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందన్నారు. అస్వస్థతకు గురైన మగతపాలెం వాసులను రేపటికి ఇళ్లకు పంపిస్తామన్నారు. అలాగే గ్రామంలో తాగునీటి వనరులు క్లోరినేషన్‌ చేయాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించామన్నారు. గ్రామంలో మూడు రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహించమని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ ఎస్‌.లక్ష్మణరావు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కృష్ణారావు, డాక్టర్‌ ప్రవీణ్‌వర్మ  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement