Jul 29 2021 @ 02:30AM

‘నా సెకండ్‌ ఇన్సింగ్స్‌కు గుర్తింపు తెచ్చే సినిమా ఇది

‘నా నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ‘పోలీస్‌ స్టోరీ’, ‘ప్రస్థానం’ వంటివి  నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. యాభై ఏళ్ల  సినీ జీవితంలో నేను ఇప్పటివరకూ పోషించిన పాత్రలు నా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌కు వైభవాన్ని తీసుకువస్తే, నా సెకండ్‌ ఇన్నింగ్స్‌కు అద్భుతమైన గుర్తింపు తెచ్చే సినిమా ‘ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం’. ఈ సినిమాతో హీరో కిరణ్‌కు కూడా మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నా’ అన్నారు సాయికుమార్‌. 


కిరణ్‌ అబ్బవరం, ప్రియాంక జువాల్కర్‌ జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం నాడు హైదరాబాద్‌ ఏఎంబీ మల్టీప్లెక్స్‌ థియేటర్‌లో విడుదల చేశారు. హీరో కిరణ్‌ మాట్లాడుతూ ‘ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది.నేను చెప్పిన కథ నచ్చి, నా మీద నమ్మకంతో ఈ సినిమా తీసిన ప్రమోద్‌, రాజులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే దర్శకుడు శ్రీధర్‌ సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు’ అని చెప్పారు. వచ్చే నెల ఆరున చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రమోద్‌, రాజు చెప్పారు. ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌ రైట్స్‌ను శంకర్‌ పిక్చర్స్‌ సంస్థ కొనుగోలు చేసింది.