Oct 13 2021 @ 03:54AM

అంతిమ తీర్పుకు వేళాయె!

సల్మాన్‌ ఖాన్‌, అతని బావ ఆయుష్‌ శర్మ హీరోలుగా నటించిన చిత్రం ‘అంతిమ్‌: ద ఫైనల్‌ ట్రూత్‌’. మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహించారు. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవంబర్‌ 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌, జీ స్టూడియోస్‌ ప్రకటించాయి. ఎలాగైనా పైకి ఎదగాలని ప్రయత్నించే ఓ గ్యాంగ్‌స్టర్‌ను నిజాయతీ గల పోలీస్‌ ఎలా అడ్డుకున్నాడనే కథతో సినిమా రూపొందించారు. ఇందులో సల్మాన్‌ పోలీస్‌గా, ఆయుష్‌ గ్యాంగ్‌స్టర్‌గా నటించారు.


Bollywoodమరిన్ని...