Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇలా అయితే కష్టమే!

  1. మెస్‌ బిల్లులు రూ.8.35 కోట్లు పెండింగ్‌ 
  2. ఆందోళనలో సరఫరాదారులు, హాస్టళ్ల నిర్వాహకులు


కర్నూలు(ఎడ్యుకేషన)/ఆలూరు, డిసెంబరు 8: జిల్లాలోని ఆదర్శ పాఠశాలల వసతి గృహాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ, వసతి గృహాల్లో మెస్‌ బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు రూ.8.35 కోట్లు రావాల్సి ఉంది. ఏప్రిల్‌ మెస్‌ బిల్లులు రూ.1.35 కోట్లు, ఆగస్టు నుంచి నవంబరు వరకు రూ.7 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో సరఫరాదారులు, హాస్టళ్ల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలనెలా అప్పులు చేసి ఆహారం ఇవ్వలేమని సరఫరాదారులు చేతులెత్తేయడంతో కొన్నిచోట్ల హాస్టళ్ల నిర్వహకులే వాటిని సమకూర్చి విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్నారు. 

-  జిల్లా వ్యాప్తంగా 36 మోడల్‌ స్కూల్స్‌ ఉండగా వాటికి అనుబంధంగా 35 బాలికల వసతి గృహాలు ఉన్నాయి. 2020 వరకు ఆర్‌ఎంఎస్‌ఏ పరిధిలో ఉన్న బాలికల వసతి గృహాలను సమగ్ర శిక్షలోకి విలీనం చేశారు. ప్రతి నెలా హాస్టళ్ల నిర్వహణకు డైట్‌ బిల్లులు జేఎనబీ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. దీంతో నేరుగా బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా సంబంధిత వ్యాపారి ఖాతాకు జమ అవుతాయి. ప్రతినెలా హాస్టళ్లకు అవసరమైన రేషన సరుకులు, పాలు, కూరగాయలు, గుడ్లు, చికెన, గ్యాస్‌ సరఫరాకు ప్రభుత్వమే టెండర్లు నిర్వహించి సరఫరా బాధ్యతలను అప్పగించింది. అయితే వారికి బిల్లులు మంజూరు కాకపోవడంతో ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు వ్యాపారులను ప్రాధేయపడి సరఫరా చేయించుకుంటున్నారు. గ్యాస్‌ కూడా సరఫరా చేయలేమని ఏజెన్సీలు తేల్చి చెబుతున్నాయి. 

ఖాజీపేట ప్రిన్సిపాల్‌ సస్పెన్షనతో వెలుగులోకి.. 

పెండింగ్‌లో ఉన్న బిల్లులను సొంతంగా చెల్లించి ఖర్చు పెట్టలేక హాస్టల్‌ నిర్వహణ సాధ్యం కాదని విద్యార్థినులను ఇళ్లకు పంపించిన కడప జిల్లా ఖాజీపేట మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సురేష్‌బాబును అధికారులు సస్పెండ్‌ చేయడం విద్యాశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెండింగ్‌లో ఉన్న బిల్లుల వ్యవహారంపై పత్రికల్లో కథనాలు రావడంతో విద్యాశాఖ అధికారులు మంగళవారం హడావుడి చేశారు. సాయంత్రంలోగా అన్ని రకాల బిల్లులను అప్‌లోడ్‌ చేయాలని ప్రిన్సిపాళ్కఉ వాట్సాప్‌ సందేశాలు పంపించారు. 


రెండు రోజుల్లో చెల్లిస్తాం: జిల్లా సమగ్ర శిక్ష అడిషినల్‌ కో ఆర్డినేటర్‌ డా.వేణుగోపాల్‌

ఆదర్శపాఠశాలలు, కేజీబీవీల్లో వసతి గృహాల మెస్‌ బిల్లులు రెండు రోజుల్లో చెల్లిస్తాం. పాటు గ్యాస్‌, గుడ్లు, కరెంటు బిల్లులు, పాలు సప్లయ్‌దారులకు కూడా బిల్లులను చెల్లిస్తాం. 
Advertisement
Advertisement