Abn logo
Oct 21 2020 @ 01:32AM

పట్టభద్రుల ఓటు హక్కు పత్రాల అందజేత

మేడ్చల్‌: మండలంలోని గౌడవెల్లి గ్రామంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు పట్టభద్రుల ఓటు హక్కు పత్రాల నమోదు ప్రక్రియను వేగవంతం చేసినట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రాజు తెలిపారు. మంగళవారం మండలంలో సేకరించిన పట్టభద్రుల ఓటు హక్కు పత్రాలను టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు రాజుకు అందజేశారు. కార్యక్రమంలో సంతో్‌షభాను, సంతో్‌షరెడ్డి, విష్ణు, పురషోత్తం, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement