May 9 2021 @ 15:03PM

ఉద‌య‌నిధి స్టాలిన్ ఇక సినిమాల‌కు దూరమేనా..?

కోలీవుడ్ యంగ్ హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ సినిమాల‌కు దూరం కాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇటీవల త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎంకే పార్టీ తరపున ఎమ్మెల్యేగా  పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచాడు. దాంతో ఇకపై రాజకీయాల మీదే ఎక్కువగా దృష్ఠి సారించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే సినిమాలకు దూరం కాబోతున్నాడనే మాట కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. స్టాలిన్ నుంచి మాత్రం ఇంకా దీనికి సంబంధించిన అధికారక ప్రకటన వెలువడలేదు. 2008లో 'రెడ్ జైంట్ మూవీస్' పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి విజయ్, త్రిష జంటగా 'కురువి' నిర్మించారు. ఆ తర్వాత 2009లో 'ఆధవాన్', 2010లో 'మన్మధన్', 'అంబు', 2010లో 'సెవెంత్ సెన్స్' సినిమాలను నిర్మించాడు. 2012లో 'ఓరు కల్ ఓరు కన్నడి' సినిమాతో హీరోగాను మారాడు. ఇదే సినిమా తెలుగులో 'ఓకే ఓకే'గా రిలీజయింది. కాగా ప్రస్తుతం ఈయన మూడు సినిమాలలో నటిస్తున్నట్టు సమాచారం.