Jun 19 2021 @ 09:43AM

మరోసారి సాయి పల్లవిని రిపీట్ చేస్తున్నారా..?

దర్శకుడు శేఖర్ కమ్ముల తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో తన నెక్స్ట్ సినిమాను ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇందులో సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నట్టు ప్రచారం మొదలైంది. ధనుష్ తెలుగులో నటిస్తున్న ఫస్ట్ స్ట్రైట్ మూవీ కావడం విశేషం. ఆయన తమిళంలో నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. అలా ఇక్కడ ధనుష్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక శేఖర్ కమ్ముల - ధనుష్ కాంబినేషన్ అనగానే అందరిలోనూ అంచనాలు భారీగా మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌లోకి సాయి పల్లవి యాడ్ అయితే మరింత క్రేజ్ వస్తుందని మేకర్స్ అనుకుంటున్నారట. సాయి పల్లవి ఇటు శేఖర్ కమ్ములతో 'ఫిదా', తాజాగా 'లవ్ స్టోరి' సినిమాలు చేసింది. అటు ధనుష్‌తోను 'మారి 2'లో జతకట్టింది. ఈ సినిమాలోను 'రౌడీ బేబీ' సాంగ్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో సాయి పల్లవిని దాదాపు ఫైనల్ చేసుకునే అవకాశాలున్నాయట. ఇదే గనక నిజమైతే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఈ ప్రాజెక్ట్‌తోనే జరగుతుంది. చూడాలి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో.