Jun 18 2021 @ 09:00AM

'సీటీమార్' కంటే ముందు 'పక్కా కమర్షియల్' రాబోతుందా..?

యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పక్కా కమర్షియల్'. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ 'సీటీమార్' కంటే ముందే రిలీజ్ అవుతుందంటూ నెట్టింట వార్త చక్కర్లు కొడుతోంది. నిజానికి గోపీచంద్ - తమన్నా భాటియా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కరోనా కారణంగా వాయిదా పడింది. మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటించనున్నారో మేకర్స్ నుంచి కన్‌ఫర్మేషన్ లేదు. వచ్చేనెల నుంచి థియేటర్స్ ఓపెన్ అయితే గనక 'లవ్ స్టోరి', 'టక్ జగదీష్', 'విరాట పర్వం', 'నారప్ప', 'దృశ్యం 2' లాంటి సినిమాలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. గత రెండేళ్లుగా సరైన హిట్ లేని గోపీచంద్ 'సీటీమార్' సినిమా హిట్ అందుకొని సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తయిన 'పక్కా కమర్షియల్' కూడా త్వరలో బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయాలని మేకర్స్ రెడీ అవుతున్నారట. మారుతి సినిమాను త్వరగానే పూర్తి చేసి రిలీజ్ చేస్తుంటాడు. అందుకే ఇప్పుడు 'సీటీమార్' కంటే ముందు 'పక్కా కమర్షియల్' వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో రాశిఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. యూవి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.