Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓటీఎస్‌ పేరిట డబ్బులు లాక్కుంటారా?

  ప్రభుత్వంపై టీడీపీ నాయకుల మండిపాటు


కర్నూలు(అగ్రికల్చర్‌), డిసెంబరు 8: ఓటీఎస్‌ పేరిట ప్రజల నుంచి డబ్బులు లాక్కుంటారా? అని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో వనటైమ్‌ సెటిల్మెంట్‌ స్కీమ్‌ను నిరసిస్తూ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్లకార్డులు ప్రదర్శించారు. ఓటీఎస్‌ను రద్దు చేసి పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. Advertisement
Advertisement