May 11 2021 @ 15:09PM

కియారా అంత డిమాండ్ చేస్తోందా..?

కియారా అద్వానీ టాలీవుడ్ సినిమా చేయాలంటే భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియారా అక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. హిందీ సినిమాలకి నేషనల్ వైడ్‌గా క్రేజ్ ఉంటుంది కాబట్టి హీరోయిన్‌కున్న డిమాండ్‌ను బట్టి బాలీవుడ్ నిర్మాతలు భారీగా రెమ్యునరేషన్ ముట్ట చెబుతుంటారు. అదే ఆలోచనతో టాలీవుడ్ సినిమాకి డేట్స్ ఇవ్వమంటే హిందీలో ఎంత అందుకుంటున్నారో అంతే ఇక్కడ కూడా డిమాండ్ చేస్తున్న హీరోయిన్స్ ఉన్నారు. ఆ లిస్ట్‌లో ఇప్పుడు కియారా అద్వానీ కూడా చేరిందని చెప్పుకుంటున్నారు. తెలుగు సినిమా కోసం దాదాపు రెండున్నర కోట్లు డిమాండ్ చేస్తుందనే మాట వినిపిస్తోంది. ఈమె హిందీలో నటించిన 'షేర్ షా' రిలీజ్‌కు రెడీగా ఉంది. 'భూల్ బులయ్యా2', 'జుగ్ జుగ్ జీయో', 'మిస్టర్ లేలే' చిత్రీకరణ దశలో ఉన్నాయి. కాగా 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకున్న కియారా 'వినయ విధేయ రామ' సినిమా తర్వాత బాలీవుడ్‌కే పరిమితమైంది.