May 8 2021 @ 16:45PM

'ఖిలాడి' బడ్జెట్ పెరిగిందా..?

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఖిలాడి' సినిమా బడ్జెట్ పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు కరోనా సెకండ్ వేవ్ కారణం అని తెలుస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన 25రోజుల షెడ్యూల్ ఇటలీలో ప్లాన్ చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్  ఉధృతితో ఇటలీ ప్రభుత్వం ఆంక్షలు విధించిన కారణంగా సగం షూటింగ్ అయ్యాక చిత్ర బృందం ఇండియాకి తిరిగి వచ్చేశారు. అయితే ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ కూడా సంతృప్తికరంగా మేకర్స్‌కి అనిపించకపోవడంతో మెత్తం షెడ్యూల్ మళ్ళీ ప్లాన్ చేస్తున్నారట. కొత్త షెడ్యూల్ కోసం మళ్ళీ బడ్జెట్ కేటాయించాల్సిదే. దాంతో దాదాపు 10 కోట్ల వరకు బడ్జెట్ పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ నెల 28న రిలీజ్ కావాల్సిన 'ఖిలాడి' పోస్ట్‌పోన్ అయింది.