Abn logo
Sep 18 2021 @ 00:34AM

ఇంత అరాచకమా..?

అనంతపురంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న టీఎనఎస్‌ఎఫ్‌ నాయకులు..

చంద్రబాబు ఇంటిపై దాడిని ఖండిస్తూ వెల్లువెత్తిన నిరసనలు

వైసీపీ రౌడీ పాలనపై టీడీపీ నాయకుల మండిపాటు

జోగి రమేష్‌ సభ్యత్వం రద్దుకు కాలవ డిమాండ్‌

అనంతపురం వైద్యం, సెప్టెంబరు17: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ కార్యకర్తలతో కలిసి దాడికి దిగడంపై తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్నాయి. ఇది అరాచకమంటూ జిల్లాలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలో టీడీపీ నాయకులు సరిపూటి రమణ, సుధాకరయాదవ్‌, మారుతీగౌడ్‌, నారాయణస్వామి యాదవ్‌, గుర్రం నాగభూషణం, వెంకటే్‌షగౌడ్‌, దేవళ్ల మురళి, రాయల్‌ కొండయ్య, నరసింహులు, బొమ్మినేనిశివ, పూల బాషా, మణి రవి, దాదు, విశ్వనాథ తదితరులు అంబేడ్కర్‌ విగ్రహం ఆందోళన చేపట్టారు. టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు గుత్తా ధనుంజయనాయుడు, వెంకటప్ప, బండి పరశురాం, లక్ష్మీనరసింహా, బాల లోకేష్‌, బ్యాళ్ల నాగేంద్ర, రామాంజనేయులు, దండు కేశవ, రాజు తదితరులు పాల్గొని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం రూరల్‌ మండల టీడీపీ నాయకులు కళ్యాణదుర్గం బైపాస్‌ సర్కిల్లో బాబు ఇంటిపై దాడిని నిరసిస్తూ ఎమ్మెల్యే జోగి రమేష్‌ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. హిందూపురంలో ఎన్టీఆర్‌ సర్కిల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి బాబు ఇంటిపై దాడి చేసి న ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తాడిపత్రి నియోజకవర్గం రాయలచెరువులో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి వాహనాలు తిరగకుండా అడ్డుకుని నిరసన తెలిపారు. వైసీపీ రౌడీ పాలన జరుపుతోందని జి ల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు పల్లె రఘునాథ్‌రెడ్డి, కందికుంట ప్రసాద్‌, ప్రభాకరరెడ్డి, జితేంద్రగౌడ్‌, మాదినేని ఉమామహేశ్వరనాయుడు, బండారు శ్రావణి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఆలం నరసానాయుడు, జేఎల్‌ మురళీధర్‌, బుగ్గయ్యచౌదరి, వెంకటశివుడు యాదవ్‌, మాజీ మేయర్‌ మదమంచి స్వరూపతో పాటు పలువురు నేతలు, శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన కనుసన్నల్లోనే టీడీపీ నేతలపై దాడులు, కేసులు జరుగుతున్నాయని పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారం శాశ్వతం కాదని అన్ని రాసుకుంటున్నాం. మాకు మంచి కాలం వస్తుంది వడ్డీతో చెల్లిస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు. 


ఎమ్మెల్యే జోగి రమేష్‌ సభ్యత్వం రద్దు చేయాలి

-  కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి

చంద్రబాబు ఇంటిపై అనుచరులతో కలిసి దాడికి దిగిన ఎమ్మెల్యే జోగిరమే్‌షపై కేసు నమోదు చేసి ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ప్రతిపక్ష నేత ఇంటిపై ఓ ఎమ్మెల్యే ఇలా దాడి చేయడం చూస్తుంటే డీజీపీ ఏం చే స్తున్నారో చెప్పాలి. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాం గం తప్ప అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలు కావడం లేదు. చంద్రబాబుకే రక్షణ లేకపోతే మిగిలిన ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేసు పెట్టి చే తులు దులుపుకోవడం కాదు.. కఠిన చర్యలు తీసుకోవాలి. 


రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? 

- మాజీ మంత్రి పరిటాల సునీత

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి పైనే అధికార పార్టీ ఎమ్మెల్యే దాడికి దిగారంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది. ఈ దాడి డీజీపీకి కనిపిం చడం లేదా? ప్రతిపక్షాలు ఏదైనా ఉద్యమం చేయాలంటే కొవిడ్‌ చట్టం, 30 యాక్ట్‌తో అడ్డుకుంటున్నారు. వందలాది మంది రౌడీ మూకలతో ఓ ఎమ్మెల్యే జడ్‌ ప్లస్‌ భద్రత ఉండీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళితే ఈ యాక్ట్‌లు ఏమయ్యాయి. వెంటనే ఎమ్మెల్యే జోగి రమే్‌షను అరెస్ట్‌ చేయాలి. లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల ఇళ్లను ముట్టడిస్తాం.


రాక్షస పాలనకు నిదర్శనం

- బీకే పార్థసారథి హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాక్షస పాలన సాగుతోంది. అభివృద్ధి, సంక్షేమాన్ని వదిలేసి దోచుకోవడంతో పాటు టీడీపీ నేతలను దెబ్బతీయడంపైనే అధికార పార్టీ నేతలు శ్రద్ధ చూపుతున్నారు. మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబునాయుడుపై అధికార పార్టీ ఎమ్మెల్యే రౌడీలను వేసుకెళ్లి రాళ్లదాడి చేయడం రాక్షస పాలనకు నిదర్శనం. పోలీసుల తీరు మరింత బాధ కలిగిస్తోంది. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే జోగి రమేష్‌, వైసీపీ రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలి.

నగరంలో ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు