Abn logo
Jul 11 2020 @ 05:31AM

‘ఏకేఆర్‌’ మాకొద్దు

కాంట్రాక్టర్‌ను తప్పించాలని ఇరిగేషన్‌ సిఫార్సు

12 ఏళ్లగా సా......గుతున్న ఆధునికీకరణ 

ప్రభుత్వ పరిశీలనలో ప్రక్రియ 


నెల్లూరు (రూరల్‌), జూలై 10 : జలయజ్ఞం పథకంలో భాగంగా 2008లో  కనుపూరు కాలువ ఆధునికీకరణ పనులు దక్కించుకున్న ఏకేఆర్‌ నిర్మాణ సంస్థ నేటికీ ఆ పనులను పూర్తి చేయలేకపోవడంతో మరొకరికి బాధ్యతలు అప్పగించాలని జలవనరుల శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సంగం నుంచి మొదలై మనుబోలు మండలం రాజవోలుపాడు వద్ద ముగిసే కనుపూరు కాలువ 55 కి.మీ. నీటిని తరలిస్తుంది. మనుబోలు, పొదలకూరు, వెంకటాచలం, నెల్లూరు రూరల్‌ మండలాల్లో సుమారు 66 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది.


85 చెరువులకు నీటి వనరుగా మారి చేపల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తోంది. మొత్తం 55 కి.మీ. పొడవైన కాలువలో 30 కి.మీ. మాత్రమే పనులు జరిగాయి. ఆధునికీకరణ పనులపై స్పష్టత కోరుతూ జలవనరుల శాఖ అధికారులు రెండు పర్యాయాలు కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఏకేఆర్‌ సంస్థ నుంచి బదులు లేకపోవడంతో ఈ విషయాన్ని ఆ శాఖ ఎస్‌ఈ ప్రభుత్వానికి నివేదించారు. దీంతో కాలువ ఆధునికీకరణ పనుల నుంచి ఏకేఆర్‌ సంస్థ నుంచి తప్పించే అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. 

Advertisement
Advertisement
Advertisement