Advertisement
Advertisement
Abn logo
Advertisement

బహిరంగంగా పాటలు పాడి నువ్వు పెద్ద పాపం చేశావంటూ ఓ యువతికి వేధింపులు.. వీడియో వైరల్

టెహ్రాన్: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఒకచోట మహిళలను వేధిస్తున్న ఉదంతాలు ప్రతీరోజూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్‌లో ఇటువంటి ఉందంతమొకటి వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ బహిరంగంగా పాట పాడినందుకు అవహేళనకు గురైంది. ఈ ఉదంతానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక మహిళ చేతిలో గిటార్ పట్టుకుని, దానిని వాయిస్తూ కనిపిస్తోంది. అదేసమయంలో అక్కడున్న ఒక వ్యక్తి ఆ మహిళ పాట పాడటాన్ని అడ్డుకున్నాడు.

సోషల్ మీడియాలో ఈ వీడియోను రష్యా జర్నలిస్టు మహీసా అలినెజాద్ షేర్ చేశారు. దానిలో ఒక మహిళ పాటపాడుతుండగా, దానిని ఒక వ్యక్తి అడ్డుకుంటూ కనిపిస్తున్నాడు. అయితే దీనిని గమనించిన అక్కడున్న కొంతమంది జనం ఆ మహిళకు మద్దతునిస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన జర్నలిస్టు... ‘ఈ వివాదం ఇరాన్‌లో చోటుచేసుకుంది. పాటపాడుతున్న ఒక మహిళను నేవీ పోలీస్ ఇబ్బందులకు గురిచేశాడు. మహిళలు పాటలు పాడటం పాపం అని అన్నాడు. అయితే అక్కడున్న కొంతమంది ఆమెను పాటను కొనసాగించాలని ప్రోత్సహించారు. దీంతో ఆ వ్యక్తి వారికి సమాధానమిస్తూ బహిరంగ ప్రదేశాల్లో మహిళలు పాటలు పాడటం పాపం. వారు పాటలు పాడవచ్చు... కానీ బహిరంగ ప్రదేశాల్లో కాదు’ అని అన్నాడు. ఈ మాట వినగానే అక్కడున్న జనం... దేశంలో దోపిడీలు, దొంగతనాలు లాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. నీ దృష్టి వాటిమీద పెట్టు... అని అన్నారు. అక్కడున్నవారంతా మద్దతు పలకడంతో ఆమె తిరిగి తన పాటను కొనసాగింది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement