Abn logo
Oct 25 2020 @ 15:53PM

భారత్‌కు తీపి కబురు చెప్పిన అమెరికా!

Kaakateeya

న్యూఢిల్లీ: అమెరికా, భారత్‌ విదేశాంగ, రక్షణ శాఖల మధ్య మంత్రుల స్థాయిలో జరిగే 2+2 సమావేశం సోమవారం నాడు ప్రారంభం కానుంది. అమెరికా స్రెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, సెక్రెటరీ ఆఫ్ డిఫెన్స్ మార్క్ టీ ఎస్పర్ భారత్‌కు రానున్నారు. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో వీరు సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా భారత్‌కు ఓ తిపి కబురు చెప్పింది. కొన్ని అంశాల్లో ఇరాన్‌పై విధించిన ఆంక్షల అమలు నుంచి భారత్‌కు మినహాయింపునిచ్చింది. దీంతో ఇరాన్‌లో భారత్ అభివృద్ధి చేస్తున్న ఛాబహార్ పోర్టుకు ఉన్న అడ్డంకులు అమెరికా హామీతో తొలగిపోనున్నాయి. 

ఇరాన్‌కు చెందిన 18 ప్రధాన బ్యాంకులపై అమెరికా ఇటీవల ఆంక్షలు విధించింది. ఇతర దేశాలు, సంస్థలు ఈ బ్యాంకులతో ఎటువంటి లావాదేవీలు చేయవద్దని ఆదేశించింది. అయితే..చాభహార్ పోర్టు అభివృద్ధి చేస్తున్న భారత్‌కు ఇది కొత్త అడ్డంకులు సృష్టించింది. దీంతో భారత్ ఈ విషయాన్ని అమెరికా దృష్టికి తెచ్చింది. అయితే.. భారత్‌తో దౌత్య సంబంధాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న అమెరికా..ఛాబహార్ పోర్టు విషయంలో మినహాయింపు ఇచ్చేందుకు నిర్ణయించుకుంది.  ఇరు దేశాల మధ్య సోమవారం నుంచి 2+2 సమావేశాల ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఇరాన్ బ్యాంకులపై అమలవుతున్న ఆంక్షల నుంచి భారత్‌కు మినహాయింపు నిచ్చింది. 


Advertisement
Advertisement