Abn logo
May 21 2020 @ 14:27PM

ఐపీఎల్ ప్రారంభం అయ్యేది వర్షకాలం తర్వాతే..: బీసీసీఐ సీఈవో

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రద్దైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ వర్షకాలం తర్వాతే ప్రారంభం అవుతుందని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి తెలిపారు. ‘‘దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఒక్కరోజులో ఏమీ మారిపోవు. ఓ క్రమపద్ధతిలో టోర్నీ నిర్వహణకి ఉన్న అనువైన మార్గాల్ని అన్వేషిస్తున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడుతారు. ఈ లీగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి లీగ్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటాం. లాక్ డౌన్ ముగిసిన తర్వాత వర్షకాలం మొదలవుతుంది. ఆ తర్వాతే ఐపీఎల్ గురించి ఆలోచించాలి. ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ నిర్వహించడం వల్లే కలిగే నష్టం తక్కువే’’ అని రాహుల్ మీడియాకి తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement