Abn logo
Sep 20 2021 @ 21:18PM

IPL 2021: కోల్‌కతా బౌలర్లకు తలవంచిన కోహ్లీ సేన

అబుదాబి: ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలవంచింది. బులెట్లలా దూసుకొస్తున్న బంతులను ఎదుర్కోలేక ఆర్సీబీ ఆటగాళ్లు బ్యాట్లెత్తేశారు. ఫలితంగా మరో ఓవర్ మిగిలి ఉండగానే 92 పరుగులకు ఆలౌటై ప్రత్యర్థికి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. 


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ తానెంత తప్పుచేసిందీ ఔటైన తర్వాత కానీ తెలియరాలేదు. రెండో ఓవర్ నాలుగో కోహ్లీ బంతికే వెనుదిరిగాడు. నాలుగు బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి ప్రసీద్ కృష్ణ బౌలింగులో వెనుదిరిగాడు. ప్రసీద్ ఇచ్చిన ఆరంభాన్ని అందిపుచ్చుకున్న బౌలర్లు ఆ తర్వాత చెలరేగిపోయారు. అయితే, పడిక్కల్ (22), శ్రీకర్ భరత్ (16) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.


అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. పడిక్కల్, భరత్ వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. మ్యాక్స్‌వెల్ 10 పరుగులు మాత్రమే చేసి అవుటవగా, ఆదుకుంటాడునుకున్న డివిలియర్స్  డకౌట్ అయ్యాడు. మరోవైపు, అరంగేట్ర ఆటగాడు హసరంగ కూడా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆర్సీబీ పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయింది.


హర్షల్ పటేల్ 12 పరుగులు చేశాడు. 8 పరుగులు చేసిన సిరాజ్.. రసెల్‌కు దొరికపోవడంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ చక్రవర్తి, ఆండ్రూ రసెల్ చెరో మూడు తీసి ఆర్సీబీని దెబ్బకొట్టగా ఫెర్గ్యూసన్ 2, ప్రసీద్ కృష్ణ ఒక వికెట్ తీసుకున్నారు. 

క్రైమ్ మరిన్ని...