Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యార్థి, టీచర్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్.. స్టూడెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

టెక్సాస్: విద్యార్థి, టీచర్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. విద్యార్థి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ టీచర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఇంతకూ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


అమెరికాలో జాతి వివక్షత నిర్మూలిన కోసం బైడెన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ అగ్రరాజ్యంలో జాత్యంహకార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా టెక్సాస్‌లోని పాఠశాలలో జాత్యంహకార దాడి జరిగింది. కాసిల్‌బెర్రీ హై స్కూల్‌లో శ్వేతజాతికి ఓ విద్యార్థిని నల్లజాతీయురాలైన టీచర్‌పై దాడి చేసింది. ఆమెను నోటికొచ్చినట్టు తిడుతూ అవమానించింది. విద్యార్థిని అతిగా ప్రవర్తించినప్పటికీ.. ఆ టీచర్ మాత్రం సహనం కోల్పోలేదు. విద్యార్థిని ఒక్కమాట కూడా అనలేదు. కాగా.. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న ఓ కెమెరాలో రికార్డు కావడంతో.. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. జాతి వివక్షత చూపిన విద్యార్థినిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు.. సహనం కోల్పోకుండా ఉన్న టీచర్‌పై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో స్పందించిన అధికారులు.. ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement