Abn logo
Jul 15 2020 @ 03:42AM

ముగిసిన అంతర్జాతీయ కవితోత్సవం

వర్చ్యువల్‌ విధానంలో నిర్వహణ


 గుంటూరు (విద్య), జూలై 14: స్థానిక జేకేసీ కళా శాలలోని ఆం గ్లశాఖ ఆధ్వర్యంలో ఈనెల 7న ప్రారం భమైన 13వ అంతర్జాతీయ కవి తోత్సవాలు మంగళ వారం ముగిశాయి. ఈ ఏడాది కొవిడ్‌ కారణంగా కవితోత్సవాలను వర్చ్యువల్‌ విధానంలో నిర్వహించినట్లు కళాశాల ఆంగ్లశాఖాధిపతి పి.గోపిచంద్‌ వెల్లడించారు. వలస కార్మికులు, నిరుద్యోగం, ఆకలిచావులు, ఫ్రంట్‌లైన్‌ పర్సన్స్‌ తదితర అంశాలపై అనేక కవితలు వచ్చాయని తెలిపారు. మొత్తం 173 దేశాల నుంచి, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కవితలు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, జాగర్లమూడి మురళీమోహన్‌, పూర్వ అధ్యక్షులు డాక్టర్‌ కొండబోలు బసవపున్నయ్య,  ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఐ.నాగేశ్వరరావు, పీజీ కోర్సుల డైరెక్టర్‌ ఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, ఆంగ్ల అధ్యాపకురాలు నాగసుశీల తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement