Advertisement
Advertisement
Abn logo
Advertisement

డిసెంబరు 15 నుంచి అందుబాటులోకి అంతర్జాతీయ విమాన సర్వీసులు

న్యూఢిల్లీ, నవంబరు 26: కరోనా నేపథ్యంలో నిలిపివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులు 20 నెలల తర్వాత మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. డిసెంబరు 15 నుంచి అంతర్జాతీయ సర్వీసులను పునఃప్రారంభించనున్నట్టు పౌర విమానయాన శాఖ శుక్రవారం వెల్లడించింది. ఆరోగ్య శాఖ రిస్క్‌గా పరిగణించిన దేశాలకు మాత్రం కొవిడ్‌ పూర్వ స్థాయితో పోలిస్తే షెడ్యూల్డ్‌ సర్వీసుల్లో కొంత శాతాన్ని మాత్రమే నడిపేందుకు అనుమతించనున్నట్టు పౌర  విమానయాన శాఖ స్పష్టం చేసింది. యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోత్సువానా, చైనా, మారిషస్‌, న్యూజీలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌ను రిస్క్‌ కేటగిరీ కింద చేర్చినట్టు శుక్రవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement