Abn logo
Jul 29 2021 @ 01:56AM

తిరుమల ఔటర్‌ కార్డన్‌ రక్షణ ఏర్పాట్ల పరిశీలన

తిరుమల, జూలై 28 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రెండో దశలో చేపడుతున్న ఔటర్‌ కార్డన్‌ రక్షణ ఏర్పాట్లను బుధవారం టీటీడీ సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి పరిశీలించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా టీటీడీ ఇదివరకే మొదటి దశలో రక్షణ ఏర్పాట్లను పూర్తిచేసింది. రెండో దశ బాహ్యవలయ పనులు చేపట్టాల్సిన ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. సీవీఎస్వోతో పాటు టీటీడీ చీఫ్‌ ఇంజినీరు నాగేశ్వరరావు, ఈఈ-1 జగన్మోహన్‌రెడ్డి, ఏవీఎస్వోలు గంగరాజు, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.