Abn logo
May 23 2020 @ 05:28AM

ముంగిట్లోకి వైద్యం

పలు చోట్ల బస్తీ దవాఖానాలు ప్రారంభం  

ఎర్రగడ్డలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ 


ఎర్రగడ్డ/ కార్వాన్‌/ గచ్చిబౌలి/ రెజిమెంటల్‌బజార్‌/కవాడిగూడ/కుత్బుల్లాపూర్‌/ పేట్‌ బషీరాబాద్‌/ జీడిమెట్ల/మదీన/ఏఎ్‌సరావునగర్‌/కాప్రా/కుషాయిగూడ/ఆబిడ్స్‌/అల్వాల్‌/ఎల్‌బీనగర్‌/సైదాబాద్‌/వనస్థలిపురం/సంతో్‌షనగర్‌/తార్నాక/రాజేంద్రనగర్‌/కూకట్‌పల్లి/అఫ్జల్‌గంజ్‌/బంజారాహిల్స్‌/ ముషీరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి):  45 కొత్త ప్రాంతాల్లో పేదలకు బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చాయి. కాప్రా సాయిరాంనగర్‌, మల్లాపూర్‌, వివేకానందనగర్‌, సింగం చెరువు బస్తీ దవాఖానాలను మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ యోగితా రాణా, కలెక్టర్‌  వెంకటేశ్వర్లు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మె ల్యే భేతి సుభా్‌షరెడ్డి పాల్గొన్నారు. బంజారాహిల్స్‌ డివిజన్‌ ఎన్‌బీనగర్‌, వెంకటేశ్వరనగర్‌ కాలనీ డివిజన్‌ వెంకటేశ్వరనగర్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రారంభించారు. 


బండ్లగూడ మిల్లత్‌నగర్‌లో బస్తీ దవాఖానాను హోంమంత్రి మహమూద్‌  అలీ ప్రారంభించారు. సైదాబాద్‌  డివిజన్‌ జాకీర్‌ హుస్సేన్‌ కాలనీలో హోంమంత్రి మహమూద్‌ అలీ ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల, కార్పొరేటర్‌ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డితో కలిసి ప్రారంభించారు. సంతో్‌షనగర్‌లో బస్తీ దవాఖానాను హోంమంత్రి మహమూద్‌అలీ, యాకుత్‌పుర ఎమ్మెల్యే పాషా ఖాద్రీతో కలిసి ప్రారంభించారు.

మోండా డివిజన్‌ చాపలబాయి, నాలాబజార్‌లో బస్తీదవాఖానాను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఆబిడ్స్‌లో, గోషామహల్‌ డివిజన్‌ కామాటిపురాలో మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ ప్రారంభించారు.


గుడిమల్కాపూర్‌ డివిజన్‌ భోజగుట్ట శ్రీరాంనగర్‌లో బస్తీ దవాఖానాను డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ మిరాజ్‌ హుస్సేన్‌, కార్పొరేటర్‌ బంగారి ప్రకాశ్‌ ప్రారంభించారు. తార్నాక విజయ్‌పూరి కాలనీలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ ప్రారంభించారు.  కవాడిగూడ డివిజన్‌ రోస్‌ కాలనీలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌ జి.లాస్యనందితతో కలిసి ప్రారంభించారు.


లింగోజిగూడ డివిజన్‌ కామేశ్వరరావు కాలనీలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్‌ ముద్రబోయిన శ్రీనివా్‌సరావుతో కలిసి ప్రారంభించారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ బుద్వేల్‌లో బస్తీ దవాఖానాను మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. 


చింతల్‌ డివిజన్‌ భగత్‌సింగ్‌నగర్‌లో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, నవీన్‌ రావు, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్‌, కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జెడ్సీ వి.మమత, కార్పొరేటర్‌ రషీదా మహ్మద్‌ రఫీ ప్రారంభించారు. కేపీహెచ్‌బీకాలనీ నాలుగో ఫేజ్‌లో మంత్రి మల్లారెడ్డి బస్తీ దవాఖానాను ప్రారంభించారు. 


ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో...

చర్లపల్లి డివిజన్‌ కుషాయిగూడలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డి ప్రారంభించారు. ఏఎ్‌సరావునగర్‌ డివిజన్‌ మహే్‌షనగర్‌లో ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డి కలెక్టర్‌ వెంకటేశ్వర్లుతో కలిసి బస్తీ దవాఖానాను ప్రారంభించారు. 

 శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్‌ డివిజన్‌ ప్రేమ్‌నగర్‌ కాలనీలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కార్పొరేటర్‌ హమీద్‌ పటేల్‌, జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌తో కలిసి ప్రారంభించారు. 

కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ ద్వారకానగర్‌లో ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ బస్తీ దవాఖానాను ప్రారంభించారు.  

రంగారెడ్డినగర్‌ డివిజన్‌లోని నందానగర్‌లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, కార్పొరేటర్‌ బి.విజయ్‌శేఖర్‌గౌడ్‌ ప్రారంభించారు. 

అల్వాల్‌, మచ్చబొల్లారం డివిజన్లలో ఏర్పాటు చేసిన మూడు బస్తీ దవాఖానాలను మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రారంభించారు. 

 అధికారినగర్‌లో బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కార్పొరేటర్‌ ముద్రబోయిన శ్రీనివా్‌సరావుతో కలిసి ప్రారంభించారు. బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లోని సాహెబ్‌నగర్‌లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి  కార్పొరేటర్‌ ముద్దగౌని లక్ష్మీప్రసన్నగౌడ్‌తో కలిసి ప్రారంభించారు. 

భోలక్‌పూర్‌ డివిజన్‌ దామోదర్‌ సంజీవయ్యనగర్‌లో బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌తో కలిసి ప్రారంభించారు. 


Advertisement
Advertisement