Abn logo
May 23 2020 @ 16:07PM

`ఇండియన్-2`.. మళ్లీ మొదలైన సస్పెన్స్!

విశ్వనటుడు కమల్‌హాసన్ హీరోగా తమిళ అగ్ర దర్శకుడు శంకర్ రూపొందించిన చిత్రం `భారతీయుడు`. 1996లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన నాటి నుంచి ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఒకదాని వెంట మరొకటిగా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.


ఆరంభంలోనే నిర్మాణ సంస్థతో హీరో, దర్శకుడికి గొడవలు జరిగాయి. అవి సద్దుమణిగి మళ్లీ షూటింగ్ మొదలవగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రేన్ విరిగిపడి ప్రాణనష్టం సంభవించింది. పోలీసుల చుట్టూ తిరగవలసి వచ్చింది. ఆ తర్వాత కరోనా వచ్చి పడింది. లాక్‌డౌన్ తర్వాత మళ్లీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందా? అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. సినిమా మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఇతర కారణాల వల్ల రూ.10 కోట్ల వరకు నిర్మాతకు నష్టం వాటిల్లిందట. అందుకే ఈ సినిమాను సగంలోనే ఆపెయ్యాలని నిర్మాత భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. `ఇండియన్-2` మళ్లీ పట్టాలెక్కడం కష్టమేనని తమిళ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement