Abn logo
Oct 24 2020 @ 19:15PM

దేవుడికన్నా త్రివర్ణ పతాకమే గ్రేట్.. నెట్టింట్లో ట్రెండింగ్

Kaakateeya

దేశంలో రాజ్యాంగ విధానాలకు ముప్పు వాటిల్లుతోందంటూ సోషల్‌ మీడియాలో ఆందోళన మొదలైంది. మనుస్మృతిని మళ్లీ అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాజ్యాంగ విధానాలను తుంగలో తొక్కుతున్నారంటూ ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌లలో అనేకమంది పోస్టులు పెడుతున్నారు. భారతీయులంతా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఈ దేశం లౌకికవాద దేశమని, దేవుడికన్నా త్రివర్ణపతాకానికే ఇక్కడ విలువుంటుందని, రాజ్యాంగం ముందు మనుస్మృతి ఎందుకూ పనికిరాదని పోస్ట్‌లు పెడుతున్నారు. జాతీయ పతాకానికి కానీ, భారత రాజ్యాంగ అస్థిత్వానికి కానీ ముప్పు తెచ్చేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే.. దేశ ప్రజలు చూస్తూ ఊరుకోరని, ఒక్కటిగా చేరి ఉప్పెనలా మారి  అలాంటి సంఘ విద్రోహ శక్తులను తుదముట్టిస్తారని హెచ్చరిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో విపరీతంగా పోస్టులు షేర్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే 'భగవాన్‌ నహీ.. తిరంగా మేరా షాన్‌...' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌ను హోరెత్తిస్తున్నారు. కేవలం 4 గంటల వ్యవధిలోనే దాదాపు 60వేల ట్వీట్లు ఈ హ్యాష్‌ట్యాగ్‌పై పోస్టయ్యాయి. హన్స్‌రాజ్‌ మీనా, హజీనా సయ్యద్‌ వంటి ప్రముఖులు కూడా ఈ హ్యాష్‌ట్యాగ్‌పై పోస్టులు పెట్టారు.

Advertisement
Advertisement