Abn logo
Nov 29 2020 @ 18:22PM

మ్యాచ్ మధ్యలో ఆస్ట్రేలియా గాళ్‌ఫ్రెండ్‌కు భారత అభిమాని ప్రపోజ్!

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మధ్యలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత ఇన్నింగ్స్ సమయంలో స్టాండ్స్‌లో ఓ రొమాంటిక్ సన్నివేశం జరిగింది. మ్యాచ్‌ను చూస్తున్న ప్రేక్షకుల మధ్య నుంచి లేచిన ఓ భారత అభిమాని మోకళ్లపై కూర్చుని ఆసీస్ జట్టు అభిమాని అయిన తన పార్ట్‌నర్‌కు ప్రపోజ్ చేశాడు. అతడి ప్రపోజ్‌ను ఆమె అంగీకరించింది. అది చూసిన ప్రేక్షకులు కేరింతలు, కరతాళ ధ్వనులతో వారిని అభినందించారు. బాయ్‌ఫ్రెండ్ ప్రేమను అంగీకరించిన ఆమె అతడిని కౌగిలించుకుని ముద్దుపెట్టింది. బౌండరీ సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆ జంటను చూసి నవ్వుతూ అభినందించాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


Advertisement
Advertisement