Abn logo
Aug 6 2020 @ 01:34AM

భారతదేశ భద్రత బీజేపీతో సాధ్యం

జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి


అయిజ, ఆగస్టు 5 : భారతదేశ భద్రత బీజేపీతోనే సాధ్యమని జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం భూమి పూజ చేశారు. అందుకు సంఘీభావంగా రామచంద్రారెడ్డి తన ఇంటి ముందు కాషాయం జెండా ఎగరవేశారు. కార్యక్రమంలో పరశురాములు, సింహద్రీ పాల్గొన్నారు. మండలంలోని బింగిదొడ్డిలో సకనలే ఇళ్ళల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాషాయ జెండాలతో ఊరేగింపు నిర్వహించారు. 

Advertisement
Advertisement