Abn logo
Aug 3 2021 @ 18:35PM

2030 కల్లా అన్ని రంగాల్లో భారత్ టాప్..అమెరికా మాజీ దౌత్యవేత్త

ముంబై: 2030 కల్లా అన్ని రంగాల్లో భారత్ అగ్రగామిగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని అమెరికా మాజీ దౌత్య వేత్త రిచర్డ్ వర్మ అభిప్రాయపడ్డారు. అతి పెద్ద ప్రజాస్వామిక దేశాలైన భారత్, అమెరికా కలిసి ఎంతో సాధించగలవని ఆయన అభిప్రాయపడ్డారు. జిందాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఆసియా దేశాల్లోకెల్లా భారత్‌లోనే ఉద్యోగ వయస్సున్న యువత సంఖ్య అధికంగా ఉంది. భారత్‌కు ఈ సానుకూలత 2050 వరకూ కొనసాగుతుంది’’ అని ఆయన తెలిపారు. భారత్‌కు అమెరికా రాయబారిగా వచ్చిన తొలి భారతీయ సంతతి వ్యక్తి రిచర్డ్ వర్మ అన్న విషయం తెలిసిందే.