Abn logo
Dec 5 2020 @ 01:54AM

బోణీ అదిరె..

  • తొలి టీ20లో భారత్‌ విజయం
  • తిప్పేసిన ‘సూపర్‌ సబ్‌’ చాహల్‌
  • ఆస్ట్రేలియాతో మ్యాచ్‌

భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసే వరకు తుది జట్టులో లేని లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌ చివరకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ప్రదర్శనతో వహ్వా అనిపించాడు. వన్డే సిరీ్‌సలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో అతడిని తప్పించినా.. జడేజాకు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి ఆస్ట్రేలియాను చావుదెబ్బ తీశాడు. ఫించ్‌, స్మిత్‌, వేడ్‌ వికెట్లను తీసి అల్లాడించాడు. అటు బ్యాటింగ్‌లో రాహుల్‌, జడేజా కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో టీమిండియా టీ20 సిరీ్‌సలో అదిరే బోణీ కొట్టింది. 


కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీ్‌సను భారత్‌ విజయంతో ఆరంభించింది. శుక్రవారం మనూకా ఓవల్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోను కనబర్చిన కోహ్లీ సేన 11 పరుగులు తేడాతో గెలిచింది. దీంతో సిరీ్‌సలో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. చాహల్‌ (3/25), అరంగేట్ర పేసర్‌ నటరాజన్‌ (3/30) కీలక వికెట్లతో ఆసీ్‌సను కట్టడి చేశారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. ఓపెనర్‌ రాహుల్‌ (40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 51), జడేజా (23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 44 నాటౌట్‌) రాణించారు. హెన్రిక్స్‌ మూడు, స్టార్క్‌ రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత ఛేదనలో ఆసీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్లు ఫించ్‌ (35), షార్ట్‌ (34), హెన్రిక్స్‌ (30) ఫర్వాలేదనిపించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా చాహల్‌ నిలిచాడు.


చాహల్‌, నట్టూ హవా: ఈ పిచ్‌పై కాస్త క్లిష్టమైన లక్ష్యమే అయినా ఆసీస్‌ ఆరంభంలో వేగంగా ఆడింది. కానీ స్పిన్నర్‌ చాహల్‌తో పాటు తొలి మ్యాచ్‌ ఆడిన పేసర్‌ నటరాజన్‌ (నట్టూ) కీలక సమయాల్లో వికెట్లు తీసి వారిని కోలుకోనీయలేదు. ఓపెనర్లు షార్ట్‌, ఫించ్‌ తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. చాహల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌లో ఫించ్‌ ఇచ్చిన క్యాచ్‌ను హార్దిక్‌ మెరుపు వేగంతో డైవ్‌ చేస్తూ అందుకున్నాడు. ఇక తన తర్వాతి ఓవర్‌లోనే ఫామ్‌లో ఉన్న స్మిత్‌ (12)ను కూడా చాహల్‌ అవుట్‌ చేయడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. ఈ క్యాచ్‌ను కూడా శాంసన్‌ ముందుకు డైవ్‌ చేస్తూ అద్భుతంగా పట్టేశాడు. దీనికి తోడు 11వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ (1)ను నటరాజన్‌ ఎల్బీ చేయడంతో మ్యాచ్‌పై భారత్‌ పట్టు సాధించింది. ఓవైపు డార్సీ షార్ట్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినా 15వ ఓవర్‌లో నటరాజన్‌కే చిక్కాడు. ఈ దశలో హెన్రిక్స్‌ కాస్త బ్యాట్‌ ఝుళిపించి ఆశలు రేకెత్తించాడు. కానీ 18వ ఓవర్‌లో పేసర్‌ చాహర్‌ బౌలింగ్‌లో అతనుకూడా అవుట్‌ కావడంతో ఆసీస్‌ ఆశలు వదులుకుంది.  


ఆదిలో రాహుల్‌.. ఆఖర్లో జడ్డూ: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత ఇన్నింగ్స్‌లో రాహుల్‌ సమయోచిత ఆటతీరుతోపాటు జడేజా ఫినిషింగ్‌ కీలకంగా నిలిచింది. మూడో ఓవర్‌లోనే ధవన్‌ (1) వికెట్‌ కోల్పోగా అటు కెప్టెన్‌ కోహ్లీ (9) కూడా నిరాశపరిచాడు. ఈ సమయంలో రాహుల్‌, శాంసన్‌ (23) మాత్రం ఆసీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. మూడో వికెట్‌కు వీరి మధ్య 38 పరుగులు జత చేరాయి. తన ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగించిన రాహుల్‌ 37 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ధాటిగా ఆడే క్రమంలో ఈ ఇద్దరితో పాటు మనీశ్‌ పాండే (2) వరుస ఓవర్లలో వెనుదిరిగారు. దీంతో 92/5 స్కోరుతో ఉన్న పరిస్థితిలో జట్టును మెరుగైన స్థితిలో నిలిపేందుకు జడేజా బాధ్యత తీసుకున్నాడు. హార్దిక్‌ (16) విఫలమైనా జడేజా ఒంటరి పోరాటం చేశాడు. 19వ ఓవర్‌లో 4,6,4,4తో 23 పరుగులు సాధించడంతో స్కోరు 150 దాటగలిగింది. చివరి ఓవర్‌లోను అతను రెండు ఫోర్లు బాదడంతో ఆసీ్‌సకు గట్టి సవాల్‌ విసిరినట్టయింది. జడేజా కంకషన్‌పై రచ్చ

తొలి టీ20లో ఆసీస్‌ బ్యాటింగ్‌కు దిగడానికి ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో పేసర్‌ స్టార్క్‌ విసిరిన రెండో బంతి జడేజా బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని హెల్మెట్‌కు బలంగా తాకింది. అయితే ఆ తర్వాత అతను రెండు ఫోర్లు కూడా బాదాడు. ఇక మ్యాచ్‌ ముగిశాక తల తిరిగినట్టుగా ఉండడంతో అతడు ఫీల్డింగ్‌కు దిగలేదు. అతడి స్థానంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా స్పిన్నర్‌ చాహల్‌ను బరిలోకి దించారు. ఈవిషయమై మ్యాచ్‌ రెఫరీ డేవిడ్‌ బూన్‌తో ఆసీస్‌ చీఫ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ వాదులాటకు దిగి తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. 18వ ఓవర్‌లో జడేజా తొడ కండరాలు పట్టేయడంతో ఫిజియో ద్వారా చికిత్స తీసుకోవడం గమనార్హం.ఫిజియో ఎందుకు రాలేదు..?

జడేజా హెల్మెట్‌కు బంతి బలంగా తాకినప్పుడు, నిబంధనల ప్రకారం భారత జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి అతన్ని పరీక్షించాలని, కానీ అలా జరగలేదని నిపుణులు అంటున్నారు. ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని కామెంటేటర్లు సంజయ్‌ మంజ్రేకర్‌, మైకేల్‌ వాన్‌, ఆసీస్‌ మాజీ కోచ్‌ టామ్‌ మూడీ అన్నారు.


స్కోరుబోర్డు

భారత ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) అబాట్‌ (బి) హెన్రిక్స్‌ 51; ధవన్‌ (బి) స్టార్క్‌ 1; కోహ్లీ (సి అండ్‌ బి) స్వెప్సన్‌ 9; శాంసన్‌ (సి) స్వెప్సన్‌ (బి) హెన్రిక్స్‌ 23; మనీశ్‌ (సి) హాజెల్‌వుడ్‌ (బి) జంపా 2; హార్దిక్‌ (సి) స్మిత్‌ (బి) హెన్రిక్స్‌ 16; జడేజా (నాటౌట్‌) 44; సుందర్‌ (సి) అబాట్‌ (బి) స్టార్క్‌ 7; చాహర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 161/7. వికెట్ల పతనం: 1-11, 2-48, 3-86, 4-90, 5-92, 6-114, 7-152. బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-34-2; హాజెల్‌వుడ్‌ 4-0-39-0; జంపా 4-0-20-1; అబాట్‌ 2-0-23-0; స్వెప్సన్‌ 2-0-21-1; హెన్రిక్స్‌ 4-0-22-3.

ఆస్ర్టేలియా ఇన్నింగ్స్‌: డార్సీ షార్ట్‌ (సి) పాండ్యా (బి) నటరాజన్‌ 34; ఫించ్‌ (సి) పాండ్యా (బి) చాహల్‌ 35; స్మిత్‌ (సి) శాంసన్‌ (బి) చాహల్‌ 12; మ్యాక్స్‌వెల్‌ (ఎల్బీ) నటరాజన్‌ 2; హెన్రిక్స్‌ (ఎల్బీ) చాహర్‌ 30; వేడ్‌ (సి) కోహ్లీ (బి) చాహల్‌ 7; అబాట్‌ (నాటౌట్‌) 12; స్టార్క్‌ (బి) నటరాజన్‌ 1; స్వెప్సన్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 150/7. వికెట్ల పతనం: 1-56, 2-72, 3-75, 4-113, 5-122, 6-126, 7-127. బౌలింగ్‌: చాహర్‌ 4-0-29-1; వాషింగ్టన్‌ సుందర్‌ 4-0-16-0; షమి 4-0-46-0; నటరాజన్‌ 4-0-30-3; చాహల్‌ 4-0-25-3.
Advertisement
Advertisement
Advertisement