Abn logo
Jun 4 2020 @ 02:48AM

6న భారత్‌-చైనా సైనిక చర్చలు

  • మూడో పక్షం జోక్యం అక్కర్లేదు
  • భారత్‌తో ఒప్పందాలకు కట్టుబడి ఉన్నాం: చైనా

న్యూఢిల్లీ/బీజింగ్‌, జూన్‌ 3: లద్దాఖ్‌ లో చైనా సేనలు భారీ సంఖ్యలో మో హరించిన నేపథ్యంలో సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలు తగ్గే సూచనలు క నిపిస్తున్నాయి. దీనికి తొలిమెట్టుగా భా రత్‌, చైనా సైనికాధికారులు శనివారం లద్దాఖ్‌లో చర్చలు జరపనున్నారు. చర్చలపై భారత్‌ చేసిన విజ్ఞప్తిపై చైనా సానుకూలగా స్పందించింది. లద్దాఖ్‌లోని చుషుల్‌-మోల్డో వద్ద ఈ చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో 14 కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్టినంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌ భారత బృందానికి నాయకత్వం వహించనున్నారు. భారత్‌తో సరిహద్దు వివాదం విషయంలో మూడో పక్షం జోక్యం అనవసరమని చైనా పేర్కొంది.


సమస్యను పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు తమ రెండు దేశాలకు ఉన్నాయని స్పష్టం చేసింది.  ఈ అంశంపై భారత ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మంగళవారం ఫోన్‌లో మాట్లాడిన నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ బుధవారం స్పందించారు. ‘మూడో పక్షం జోక్యం అవసరమే లేదు. భారత్‌తో సరిహద్దు విషయంలో మా విధానం స్పష్టంగానే ఉంది. ఇరు దేశాల అధినేతల మధ్య కుదిరిన ఒప్పందాలను మేం అమలు చేస్తూనే ఉన్నాం’ అని ఝావో అన్నారు. 


Advertisement
Advertisement
Advertisement