Abn logo
Aug 7 2020 @ 03:54AM

చిచ్చరపిడుగు.. ఆ చిన్నారి!

  • ఏ దేశం జెండానైనా ఇట్టే పట్టేస్తాడు

నార్సింగ్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఆ బుడతడి వయసు మూడేళ్లు. సాధారణంగా ఆ ఈడు పిల్లలు ఒక దేశం జెండాను గుర్తుపట్టడమే కష్టం. కానీ, ఈ చిచ్చరపిడుగు ఏకంగా 195 దేశాల జాతీయ పతాకాలను అలవోకగా గుర్తించేస్తున్నాడు. ఈ క్రమంలో అనేక రికార్డులు సృష్టించేశాడు. ఆ చిన్నారి పేరు షణ్ముఖ సుదర్శన్‌ ఘాజీ. ఐటీ ఉద్యోగి పవన్‌కుమార్‌ ఘాజీ, పావని దంపతుల కుమారుడు. వీరు కోకాపేట్‌లో నివాసం ఉంటున్నారు. తన ప్రతిభతో ఇప్పటికే ఈచిన్నారి.. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. 

Advertisement
Advertisement
Advertisement