Abn logo
Jul 12 2020 @ 03:52AM

పెరిగిన ర్యాపిడ్‌ పరీక్షలు

ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లతో 2480 టెస్టులు 

రెండురోజుల్లో 501 పాజిటివ్‌ కేసులు నమోదు 

30 నిమిషాల వ్యవధిలోనే కొవిడ్‌ ఫలితాలు


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): జిల్లాలోని మునిసిపాలిటీల్లో, గ్రామీణప్రాంతాల్లోనూ కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నాయి. సాధారణంగా రామాంతాపూర్‌ హోమియో ఆస్పత్రి, మల్కాజ్‌గిరి ఏరియా ఆస్పత్రిల్లో నమూనాలు సేకరించి, ఉస్మానియాకు పంపుతున్నారు. ఫలితాలు కోసం రెండురోజులు వేచి ఉండాల్సి పరిస్థితి. దీంతో జిల్లావ్యాప్తంగా కరోనా అనుమానితులకు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ కిట్లు ద్వారా పరీక్షలు చేస్తున్నారు. దీని ద్వారా 30నిమిషాల వ్యవధిలోనే ఫలితం వెలువడుతోంది. ప్రభుత్వం మేడ్చల్‌జిల్లాకు మొత్తం 5వేల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు పంపిణీ చేసింది.


రెండురోజులుగా ర్యాపిడ్‌ కిట్ల ద్వారా 2480 పరీక్షలు చేశారు. వీటిలో 501 పాజిటివ్‌గా తేలాయి. మూడురోజులుగా జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా నిత్యం 150 పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. జిల్లాలో ఇప్పటివరకు 2813 కేసులు నమోదుకాగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 2354వరకు ఉన్నాయి. మునిసిపాలిటీల్లో 411, గ్రామీణ ప్రాంతాల్లో 48 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటివరకు 1291మంది డిశ్చార్జి కాగా, మొత్తం 1494 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 26మంది మృతి చెందారు. 


రంగారెడ్డి జిల్లాలో 666 నమూనాల సేకరణ

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : జిల్లాలో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ డిటెక్షన్‌’ పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం 666 నమూనాలు సేకరించారు. ఇందులో జీహెచ్‌ఎంసీలో 424, నాన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో  242 నమూనాలను సేకరించారు. 129 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. జీహెచ్‌ఎంసీలో 97, నాన్‌జీహెచ్‌ఎంసీలో 32 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు.

Advertisement
Advertisement