Abn logo
Sep 20 2020 @ 23:58PM

పోటాపోటీ

Kaakateeya

కస్తూర్బా విద్యాలయాల్లో ప్రవేశాలకు పెరిగిన డిమాండ్‌

1,920 సీట్లకు గాను నాలుగు వేలకుపైగా దరఖాస్తులు


మహబూబ్‌నగర్‌ (విద్యావిభాగం), సెప్టెంబరు 20 : కస్తూర్బా గాంఽధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొన్నది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్‌లో ప్రవేశాలకు సీట్ల కంటే దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. అలాగే ఆరో తరగతి నుంచి పదో తరగతి ప్రవేశాలకు కూడా ప్రవేశాలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.


ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 85 కస్తూర్బాలు ఉన్నాయి. వీటిలోనే 24 ఇంటర్‌ కళాశాలలు ఉండగా, మొదటి, ద్వితీయ సంవత్సర గ్రూపులు కొనసాగుతున్నాయి. సగం వాటిలో ఎంపీసీ, బైపీసీ తరగతులు నిర్వహిస్తుండగా, మిగతా వాటిల్లో సీఈసీ, ఎంపీడబ్ల్యూఎస్‌ కోర్సులు నడుస్తున్నాయి. ప్రతి గ్రూప్‌కు 40 సీట్లు కేటాయించగా, మొదటి, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 160 సీట్లు ఉంటాయి. 24 విద్యాలయాల్లో మొత్తం 3,840 మంది బాలికలు చదువుకుంటున్నారు. ప్రస్తుతం 2020-21 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించగా, 1,920 సీట్లకు గాను ఇప్పటికే నాలుగు వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.


కస్తూర్బాల్లో చదివే విద్యార్థినులకు కార్పొరేట్‌ స్థాయి విద్యార్థులకు అందించే విద్యను అందిస్తున్నారు. అలాగే నాణ్యమైన భోజనాన్ని పెడుతున్నారు. ప్రతి రోజూ మెనూ ప్రకారం పౌష్టికాహారం, గుడ్డు, నెలలో మూడు వారాలు చికెన్‌, రెండు వారాలు మటన్‌, వీటితో పాటు వారంలో ఒక రోజు స్వీట్‌ను భోజనంలో అందిస్తున్నారు. విద్యార్థులకు వసతి సౌకర్యం, మెరుగైన బోధన అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఉచితంగా దుస్తువులు, బడిబయటి పిల్లలకు, అనాథ బాలికలకు ఈ విద్యాలయాల్లో చదువుకునేందకు అవకాశం కల్పిస్తున్నారు. అర్హులైన ఉపాధ్యాయులతో విద్యా బోధన అందిస్తుండటంతో, ప్రస్తుతం ఈ విద్యాలయాల్లో చేరేందుకు విద్యార్థినులు పోటీ పడుతున్నారు.


పోటీ ఎక్కువగా ఉంది

కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్‌ ప్రవేశాలకు పోటీ ఎక్కువగా ఉంది. అర్హులైన విద్యార్థినులకు గుర్తించి, సీట్లు కేటాయించాలని అధికారులకు సూచించాం. 114 పీజీ సీఆర్‌టీ, సీఆర్‌టీ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటికి సంబంధించి పరీక్షలు నిర్వహించా, అర్హులను ఎంపిక చేసి భర్తీ చేస్తాం. దీనిపై ఉన్నతాధికారులకు లేఖ కూడా పంపించాం.

- ఎ.ఉషారాణి, డీఈవో, మహబూబ్‌నగర్‌

Advertisement
Advertisement
Advertisement