Advertisement

మాలీవుడ్ నిర్మాతలపై ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ దాడులు

మలయాళం సినీ పరిశ్రమ(మాలీవుడ్)పై ఇన్‌కం ట్యాక్స్ కన్ను పడింది. తాజాగా ఆ శాఖ ముగ్గురు నిర్మాతల కార్యాలయాలపై ఒకేసారి దాడులు జరిపింది. ఆంటోనీ పెరంబవూర్‌, ఆంటో జోసెఫ్, లిస్టిన్ స్టీఫెన్ తదితరుల ఇళ్లపై ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ దాడులు చేసింది. ఆ నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో జరిపిన లావాదేవీలపై ఆ శాఖ దృష్టి సారించినట్టు సమాచారం. ఈ దాడులు నవంబర్ 26న మధ్యాహ్నం మొదలయ్యాయి. ప్రస్తుతానికైతే దాడులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఈ నిర్మాతలు తము నిర్మించిన సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు అమ్మేశారు. ఆ ప్లాట్‌ఫామ్స్‌కు అమ్మేయడం ద్వారా రూ. 150కోట్ల వరకు వారు అర్జించినట్టు తెలుస్తోంది. అందువల్ల వారు ఇన్‌కం ట్యాక్స్ చెల్లించారా లేదా అనేది ఆరా తీస్తున్నట్టు సమాచారం. 


మలయాళంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ‘‘ మరక్కార్: అరేబియా సముద్ర సింహం’’.  రూ. 100కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ  సినిమాను నిర్మించారు. ఆంటోనీ పెరంబవూర్ నిర్మించారు. ఈ చిత్రం డిసెంబరు 2న థియేటర్లల్లో విడుదల కాబోతుందని నిర్మాతలు ప్రకటించారు. సినిమా విడుదలకు ముందే ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ దాడులు జరపడం గమనార్హం. ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా భారీ బడ్జెట్ సినిమా విడుదలకు ముందు ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్  దాడులు జరుపుతోంది. టాలీవుడ్‌లోను బాహుబలి సినిమా విడుదలకు ముందు కూడా నిర్మాతల కార్యాలయాలపై ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ దాడులు జరిపింది. 

Advertisement