Aug 1 2021 @ 13:46PM

విశాల్‌ చిత్రంలో కొత్త నటీనటులకు అవకాశం

కోలీవుడ్‌లోని ప్రముఖ హీరో విశాల్‌ కరోనా లాక్‌డౌన్‌తో ఏమా త్రం నిమిత్తం లేకుండా వరుస ప్రాజెక్టులకు కమిట్‌ అవుతున్నారు. ఈ యేడాది 'చక్ర' సినిమాతో ప్రేకక్షుల ముందుకు వచ్చిన ఆయన ఆ తర్వాత 'ఎనిమి', 'నాట్‌ ఏ కామన్‌మేన్‌' వంటి చిత్రాల్లో నటించారు. ఇందులో 'ఎనిమి' షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు 'నాట్‌ ఏ కామన్‌మేన్‌' (విశాల్‌-31) చిత్రం షూటింగ్‌ కూడా పూర్తయ్యింది. ఈ చిత్రం షూటింగులోనే విశాల్‌ రెండుసార్లు గాయపడ్డారు. అయినప్పటికీ... ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా సినిమా షూటింగును అనుకున్న సమయానికి పూర్తి చేశారు. 

ఇప్పుడు 'విశాల్‌-32' చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మూవీలో ఆయన కొత్తనటీనటులకు అవకాశం ఇవ్వనున్నారు. ఇందుకోసం ఆయన క్యాస్టింగ్‌ కాల్‌ ప్రకటన చేశారు. విలన్‌ పాత్రకు 25 నుంచి 30 యేళ్ళలోపువారు 5.8 నుంచి 6.2 అడుగులు ఎత్తు కలిగిన వారు, బాలుడు పాత్రకు 6 నుంచి 7 యేళ్ళలోపు సన్నగా వుండి యావరేజ్‌ ఎత్తుకలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, యుక్త వయసు యువతి పాత్రకు 16-20 యేళ్ళ మధ్య కలిగి, సన్నని శరీరాకృతి కలిగివుండాలి. ఈ పాత్రలకు తమిళనాడు, హైదరాబాద్‌ ప్రాంతాలకు చెందిన వారికి తొలి ప్రాధాన్యత ఇస్తారు. నటనపై అభిరుచి, ఆసక్తి కలిగిన వారు తమ పూర్తి వివరాలను '89250 22988' అనే నంబరుకు ఆగస్టు 15వ తేదీ లోగా వాట్సాప్‌ చేయాల్సి ఉంటుంది.

Otherwoodsమరిన్ని...