Abn logo
May 20 2020 @ 20:51PM

డబ్ల్యూహెచ్ఓ వార్షిక సమావేశాలు.. ఆ అంశాలపై దర్యాప్తు చేయాలంటూ..

జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)పై స్వతంత్ర దర్యాప్తు ప్రారంభించేందుకు ప్రపంచదేశాలు అంగీకరించాయి. డబ్ల్యూహెచ్‌వో ప్రతిస్పందన, కరోనా విజృంభణలో ఈ సంస్థ ఎంత చురుగ్గా నిర్ణయాలు తీసుకుంది? అనే అంశాలపై దర్యాప్తు చేయాలని సభ్యదేశాలు నిర్ణయించాయి. మంగళవారం డబ్ల్యూహెచోఓ వార్షిక సమావేశం జరగగా సభ్యదేశాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. కరోనా వ్యాప్తి గురించి ప్రపంచదేశాలకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో డబ్ల్యూహెచ్ఓ ఆలస్యం చేసిందని ఈ సమావేశంలో ప్రపంచదేశాలు ఆరోపించాయి. తొలిసారి వర్చువల్‌గా నిర్వహించిన డబ్ల్యూహెచ్‌వో వార్షిక సమావేశంలో.. సభ్యదేశాలన్నీ కలిసి ఓ కొత్త ప్రతిపాదన చేశాయి. కరోనా మహమ్మారి విజృంభణపై ప్రపంచ దేశాలు ఎలా స్పందించాయన్న విషయంలో నిష్పాక్షిక, స్వతంత్ర విచారణ చేయాలనేదే ఈ ప్రతిపాదాన సారాంశం. కాగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. డబ్ల్యూహెచ్ఓకు రాసిన లేఖలో ట్రంప్ అనేక విషయాలు ప్రస్తావించారు. కరోనా వ్యాప్తిపై ప్రపంచదేశాలకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే తాజాగా సభ్యదేశాల ప్రతిపాదనతో ట్రంప్ లేఖకు ప్రపంచదేశాలు మద్దతిచ్చినట్టు అయింది. 

Advertisement
Advertisement
Advertisement