Abn logo
Sep 24 2020 @ 01:51AM

మళ్లీ పెరిగాయి

ఉమ్మడి పాలమూరులో 383 మందికి కరోనా

ఒక్క నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే 127 మందికి వైరస్‌


మహబూబ్‌నగర్‌ వైద్యవిభాగం/ గద్వాలక్రైం/ నారాయణపేట క్రైం/ వనపర్తి/ కందనూలు, సెప్టెంబరు 23 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం కేసుల సంఖ్య కొంత పెరిగింది. మంగళవారం 320 కేసులు నమోదు కాగా, బుధవారం ఆ సంఖ్య 383కి చేరింది. అందులో ఎక్కువగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 127 మంది కరోనా బారిన పడ్డారు. 

  • మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం 98 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అందులో జిల్లా కేంద్రంలో 40 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. వివిధ మండలాల్లో 58 మందికి వైరస్‌ సోకింది. వారిలో అత్యధికంగా జడ్చర్లలో 17 మంది బాధితులున్నారు. 
  • జోగుళాంబ గద్వాల జిల్లాలో బుధవారం 63 కరోనా కేసులు నమోదయ్యాయి. గద్వాల పట్టణంలో నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయి. మండలాల్లో క్యాతూరులో 14, అయిజలో 10 మందికి వైరస్‌ సోకింది. మరో 35 కేసులు ఇతర మండలాల్లో నమోదయ్యాయి. 
  • నారాయణపేట జిల్లాలో తొమ్మిది మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. 
  • నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 127 మంది కరోనా బారిన పడ్డారు. అందులో మండలాల వారీగా అచ్చంపేటలో 28, బిజినేపల్లిలో 10, కల్వకుర్తిలో 12, కొల్లాపూర్‌లో 10, నాగర్‌కర్నూల్‌లో 28 మంది బాధితులున్నారు. ఇతర మండలాల్లో మరో 39 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 
  • వనపర్తి జిల్లాలో 86 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. అందులో వనపర్తి మండలంలో 45 మందికి వైరస్‌ సోకింది. పెబ్బేరులో 13 కేసులు నమోదవగా, ఇతర మండలాల్లో మరో 28 మంది బాధితులున్నారు. 

Advertisement
Advertisement
Advertisement